‘బిగ్ బాస్’.. ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది ప్రేక్షకులను అలరించి, అభిమానులను సంపాదించుకున్న అతిపెద్ద రియాలిటీ షో. ఇందులో అప్పటి వరకు తమకు అస్సలు పరిచయం లేని వారిని తీసుకొచ్చి చూపించినా ఆసక్తిగా చూస్తారు ప్రేక్షకులు.
‘బిగ్ బాస్’.. ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది ప్రేక్షకులను అలరించి, అభిమానులను సంపాదించుకున్న అతిపెద్ద రియాలిటీ షో. ఇందులో అప్పటి వరకు తమకు అస్సలు పరిచయం లేని వారిని తీసుకొచ్చి చూపించినా ఆసక్తిగా చూస్తారు ప్రేక్షకులు. అంతగా జనాలను అకట్టుకుంది ‘బిగ్ బాస్’. కంటెస్టెంట్లను సెలబ్రిటీలుగా మార్చే మ్యాజిక్ ఈ షోలో జరుగుతుంది. ఇతర భాషల్లానే తెలుగులోనూ ‘బిగ్ బాస్’ విపరీతమైన ఆదరణ దక్కించుకుంది. ఇప్పటికి విజయవంతంగా 6 సీజన్లు పూర్తయ్యాయి. త్వరలో ‘బిగ్ బాస్ సీజన్ 7 తెలుగు’ ప్రారంభం అవుతుందంటూ ఇటీవల చిన్న ప్రోమో రిలీజ్ చేశారు. అంతే, ఇక సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ మొదలైయింది. ఈసారి ఎంత మంది షోలో పాల్గొంటారు?, సెలబ్రిటీలను తీసుకొస్తారా, లేక సామాన్య ప్రజలతో షో చేస్తారా? అంటూ డిస్కషన్స్ పెడుతున్నారు.
అలాగే ఈసారి షోలో పార్టిసిపెట్ చేయబోయేదివీళ్లే అంటూ కొందరి పేర్లు కూడా ప్రస్తావిస్తున్నారు. మొన్నటి వరకు నటి మాధవీ లత పేరు వినిపించింది. ప్రస్తుతం బ్యాంకాక్ పిల్ల పేరు బాగా వినిపిస్తుంది. ఈమె గురించి యూట్యూబ్ చూసేవారి పెద్దగా పరిచయం అక్కర్లేదు. బ్యాంకాక్‌లో నివసిస్తున్న తను అసలు పేరు శ్రావణి సమంతపూడి. అక్కడ అనేక ప్రదేశాలు తిరుగుతూ, యూట్యూబ్ వీడియోస్ చేసి నెటిజన్లకు చూపిస్తుంటుంది. తన యుట్యూబ్ ఛానల్ పేరు బ్యాంకాక్ పిల్ల.
ఈ ఛానల్‌కు రెండు మిలియన్ల పైగా సబ్‌స్క్రైబర్లున్నారు. విజయనగరానికి చెందిన బ్యాంకాక్ పిల్లకి తన తన యాస భాష బాగా ప్లస్. వాటితోనే ఎంతో మందిని అట్రాక్ట్ చేస్తుంది. కాగా ఈమె వీడియోస్‌కి మిలియన్ల వ్యూస్ రావడంతో ఒక్కసారిగి సెలబ్రటీ లిస్ట్‌లోకి చేరిపోయింది. ఈ మధ్య ఓ వీడియోలో ఇండియాకు రాబోతున్నానని చెప్పింది. దీంతో బ్యాంకాక్ పిల్ల త్వరలో ప్రారంభం కాబోయే ‘బిగ్ బాస్’ షోకి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయని నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారు. మరి నిజంగానే బ్యాంకాక్ పిల్ల ‘బిగ్ బాస్’ షోకి వస్తుందా?, లేదా? తెలియాలంటే మరి కొద్ది రోజులు వేచి చూడక తప్పదు.