శుభ వార్త చెప్పిన జబర్ధస్త్ అవినాష్.. త్వరలో

0
61

ముక్క అవినాష్ ఈ పేరు గురించి కొత్తగా పరిచయం అక్కరలేదు. జబర్ధస్త్ తో తనదైన కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించి మంచి పేరు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత బిగ్ బాస్ నాలుగో సీజన్ లో నవ్వులు పూయించాడు.

తెలుగు బుల్లితెరపై వస్తున్న జబర్ధస్త్ కామెడీ షో తో ఎంతోమంది కమెడియన్లు తమ సత్తా చాటుకున్నారు. ఎప్పటికప్పుడు కొత్త కొత్త స్కీట్స్ తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు. జబర్ధస్త్ ద్వారా పరిచయం అయిన ముక్కు అవినాష్ తన కామెడీతో ప్రేక్షకులను అలరించి మంచి కమెడియన్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. ప్రస్తుతం బుల్లితెర, వెండితెరపై రాణిస్తున్నాడు. తాజాగా ముక్కు అవినాష్ అభిమానులకు ఓ శుభవార్త చెప్పాడు. వివరాల్లోకి వెళితే..

జబర్ధస్త్ కామెడీ షోలో తనదైన కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాడు ముక్కు అవినాష్. స్టార్ కమెడియన్ గా గుర్తింపు తెచ్చుకున్న ముక్కు అవినాష్ అంచెలంచెలుగా కష్టపడి ఎదిగాడు. ఈ క్రమంలోనే తన సొంతింటి కల నెరవేర్చుకున్నాడు. 2021 లో అనుజ ను పెళ్లి చేసుకొని భార్యతో సంతోషంగా జీవనం సాగిస్తున్నాడు. ఈ జంట పలు రియాల్టీ షోల్లో పాల్గొన్నారు. జబర్ధస్త్ నుంచి బయటకు వచ్చిన తర్వాత బిగ్ బాస్ రియాలిటీ షోలోకి అడుగు పెట్టి మరింత ఫేమస్ అయ్యాడు. బిగ్ బాస్ నాలుగో సీజన్ లో తనదైన కామెడీ మార్క్ చాటుకుంటూ ఎంటర్‌టైనర్‌ ఆఫ్‌ ద హౌస్‌గా పేరు తెచ్చుకున్నాడు. ఇటీవల పలు రియాల్టీ షోల్లో పాల్గొంటూ వస్తున్నన్న ముక్కు అవినాష్ తాజాగా ఓ శుభవార్త చెప్పాడు.

త్వరలో తాము తల్లిదండ్రులు కాబోతున్నామని.. ఇద్దరం ముగ్గురం కాబోతున్నాం అంటూ యూట్యూబ్ వేదికగా అవినాష్ తెలిపాడు. ‘నా భార్య అనూజ ప్రస్తుతం ప్రెగ్నెంట్.. త్వరలోనే మా ఇంట్లోకి పాపాయి లేదా బాబు రాబోతున్నారు.. మా పెళ్లై ఏడాదిన్నర అవుతుంది.. అక్టోబర్ మాసంలో మా పెళ్లి జరిగింది. పిల్లల్ని ఎప్పుడు కంటారు అని మా పేరెంట్స్, బంధువులు మమ్మల్ని ఎప్పటి నుంచో అడుగుతున్నారు. ఆ ప్రశ్నకు ఇప్పుడు సమాధానం చెప్పాం.. పెళ్లైన ఏడాదిన్నరకే మేం తల్లిదండ్రులు కాబోతున్నాం.. మూడు నెలల వరకు డాక్టర్ ఎవరికీ చెప్పొదని అన్నారు.. ప్రస్తుతం తనకు నాలుగో నెల.. అందుకే ఈ సంతోషకరమైన వార్త బయటకు చెబుతున్నాం.. నాలుగో నెలలో బేబీ గుండె చప్పుడు విన్నాం.. ఆ ఆనందాన్ని మాటల్లో వర్ణించలేం.. మా పేరెంట్స్, తన పేరెంట్స్ ఎంతో హ్యాపీగా ఉన్నారు’ అని ఆనందం వ్యక్తం చేశాడు అవినాష్.