ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను పాలించిన గొప్ప ముఖ్యమంత్రుల్లో ఒకరు వై ఎస్ రాజశేఖర్ రెడ్డి. ఆయన అత్యంత ప్రజాదరణ పొందిన నేత. ఆయన హయాంలో చేసిన సేవలను ఎప్పటికీ గుర్తుకుపెట్టుకుంటారు ప్రజలు. ఆ తర్వాత ఆయన వారసత్వాన్ని పుణికి పుచ్చుకుని వచ్చారు పిల్లలు షర్మిల, జగన్ మోహన్ రెడ్డిలు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను పాలించిన గొప్ప ముఖ్యమంత్రుల్లో ఒకరు వై ఎస్ రాజశేఖర్ రెడ్డి. ఆయన అత్యంత ప్రజాదరణ పొందిన నేత. ఆయన హయాంలో చేసిన సేవలను ఎప్పటికీ గుర్తుకుపెట్టుకుంటారు ప్రజలు. వైఎస్సార్ తీసుకువచ్చిన ఆరోగ్య శ్రీ, ఒక్క రూపాయికే బియ్యం వంటి పథకాలు అనేక రాష్ట్రాలు కూడా అనుసరిస్తున్నాయి. రాయలసీమలో పుట్టి వైద్య వృత్తిని చేపట్టి.. ప్రజల సేవ కోసం రాజకీయాల్లోకి అడుగుపెట్టిన మహానేత. ముఖ్యమంత్రిగా ఐదేళ్ల కాలంలో ప్రజా సంక్షేమ పథకాలు ఎన్నింటినో తెచ్చారు. అయితే రెండో సారి ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన వైఎస్సార్ ఓ విమాన ప్రమాదంలో మరణించారు. ఆ తర్వాత ఆయన వారసత్వాన్ని పుణికి పుచ్చుకుని వచ్చారు తనయ, తనయుడు షర్మిల, జగన్ మోహన్ రెడ్డిలు.
తండ్రి మరణాన్ని జీర్ణించుకోలేకపోయినప్పటికీ.. ఆయన ఆశయ సాధన కోసం పాటుపడ్డారు జగన్ మోహన్ రెడ్డి, షర్మిలలు. జగన్ మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కావడంలో ఆయన స్వయం కృషి ఎంత ఉందో.. షర్మిల కష్టం కూడా అంతే ఉంది. అన్నయ్య కోసం పాదయాత్రల్లో పాల్గొంది. ముఖ్యమంత్రి అయ్యేంత వరకు వెన్నంటే ప్రోత్సహించింది. ఇప్పుడు ఆమె తెలంగాణపై దృష్టి సారించింది షర్మిల. యువజన శ్రామిక రైతు తెలంగాణ పార్టీ పేరుతో ఓ పార్టీని స్థాపించి.. రానున్న తెలంగాణ ఎన్నికలపై దృష్టి సారిస్తుంది. కాగా, ఆమె వ్యక్తిగత జీవితానికి వస్తే.. అనిల్ కుమార్ అనే వ్యక్తిని వివాహం చేసుకున్న సంగతి విదితమే. ఆయన జీసెస్ బోధనలు చేస్తుంటారు. వీరికి ఇద్దరు పిల్లలు.
ఈ దంపతులకు రాజారెడ్డి, అంజలి రెడ్డి అనే పిల్లులున్నారు. ఈ రోజు వైఎస్సార్ జయంతి సందర్భంగా కుమారుడితో కలిసి.. ఆమె ఇడుపలపాయకు చేరుకున్నారు. ఆ సమయంలో కెమెరాలు క్లిక్ మనిపించాయి. ఇడుపులపాయలో తన పేరుతో ఉన్న 9.53 ఎకరాలను కుమారుడు రాజారెడ్డి పేరుతో రిజిస్ట్రేషన్ చేశారు. ఇడుపులపాయ ఎస్టేట్ వ్యవహారాలు చూసే వెంగమునిరెడ్డి నుంచి షర్మిల కొనుగోలు చేసిన 2.12 ఎకరాల భూమిని కుమార్తె అంజలిరెడ్డి పేరిట రిజిస్ట్రేషన్ చేశారు. అందులో షర్మిల కుమారుడ్ని చూసిన నెటిజన్లు, హీరో మెటీరియల్ అంటూ పొగిడేస్తున్నారు. కండలు తిరిగిన దేహరుఢ్యం, హైట్ చూసి స్టార్ హీరో రేంజ్ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఏం కటౌట్ రా బాబు కచ్చితంగా సినిమాల్లోకి వస్తే మాత్రం హీరోలకు కాంపీటీషన్ ఖాయం అని ఫన్నీగా మాట్లాడుతున్నారు.